Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Telangana Labour Department | మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇరుముడి’ మరో వివాదంలో చిక్కుకుంది.
Telangana Labour Department | మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇరుముడి’ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలనటి నక్షత్రకు సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాతలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తాజాగా అధికారిక నోటీసులు జారీ చేసింది.
‘జై లోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం’ నుంచి అందిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ చర్యలు చేపట్టారు. సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడం, అలాగే వివిధ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆమెను భాగస్వామ్యం చేయడంపై పలు కీలక అంశాలపై అధికారులు స్పష్టత కోరారు. మైనర్ బాలికతో నటింపజేయడానికి గాను జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందుగా అధికారిక అనుమతి తీసుకున్నారా, ఆమె తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక సమ్మతి పత్రం పొందారా అని ప్రశ్నించారు. అలాగే షూటింగ్ సమయంలో బాలికకు సంబంధించిన కాల్షీట్లు, అటెండెన్స్ రికార్డులు, ఆమె పనిచేసిన ఖచ్చితమైన పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు.
సినిమా షూటింగ్ కారణంగా బాలిక చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, సెట్లో ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేకంగా కేర్‌టేకర్‌ను నియమించారా అనే వివరాలు కోరారు. చట్ట నిబంధనల ప్రకారం మైనర్ బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా అని అడిగారు. కేవలం సినిమా షూటింగ్‌కే కాకుండా, ప్రీ-రిలీజ్ వేడుకలు మరియు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలలో మైనర్ బాలిక పాల్గొనే విషయంలో చట్టపరమైన నిబంధనలు ఏమేరకు పాటించారనే దానిపై వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని రికార్డులు మరియు పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు జరిగే విచారణకు స్వయంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా హాజరు కావాలని నిర్మాతలను అధికారులు స్పష్టం చేశారు. బాలల హక్కులు, చట్టాల అమలుపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

