Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
Prakash Raj | భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతినాయకుడిగా భయపెట్టినా, తండ్రి పాత్రలో భావోద్వేగాలు పండించినా, కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్రల్లో కనిపించినా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
Prakash Raj | భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతినాయకుడిగా భయపెట్టినా, తండ్రి పాత్రలో భావోద్వేగాలు పండించినా, కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్రల్లో కనిపించినా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. దశాబ్దాలుగా ఎన్నో భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన.. ఇటీవల సినిమాల్లో కొంత తక్కువగా కనిపిస్తున్నారు. అయితే దీనికి కారణం ఆయన రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా స్పందించడమేనని భార్య, ప్రముఖ నృత్య దర్శకురాలు పోనీ వర్మ వెల్లడించారు.
దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలపై ప్రకాష్ రాజ్ తరచూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో ప్రభుత్వ విధానాలు, సమకాలీన అంశాలపై ప్రశ్నలు సంధిస్తుంటారు. ఈ వైఖరి వెనుక బలమైన కారణం ఉందని పోనీ వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని ఆమె తెలిపారు. భయంతో మౌనంగా ఉండటం ఎంతకాలం? అనే ఆలోచన ఆయనలో మొదలైందని, అప్పటి నుంచి ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తన గళాన్ని వినిపించడం ప్రారంభించారని చెప్పారు.
ప్రకాష్ రాజ్ రాజకీయ అంశాలపై బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని పోనీ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సినిమాల అవకాశాలు తగ్గడమే కాకుండా, అప్పటికే ఆయన చేతిలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు కూడా చేజారిపోయాయని వెల్లడించారు. బ్రాండ్ ప్రకటనల విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని తెలిపారు. కొంతమంది దర్శక నిర్మాతలు మొదట ప్రకాష్ రాజ్‌కు కథలు వినిపించి, పాత్రలు ఖరారు చేసి అడ్వాన్సులు కూడా ఇచ్చారట. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయ అభిప్రాయాలను కారణంగా చూపిస్తూ సినిమాల నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయని పోనీ వర్మ పేర్కొన్నారు. మరికొందరు ముందుగా ఇచ్చిన అడ్వాన్సులను సైతం వెనక్కి తీసుకున్నారని చెప్పారు. సినిమా అవకాశాలు తగ్గడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం వంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రకాష్ రాజ్ తన సిద్ధాంతాలను వదులుకోలేదని పోనీ వర్మ స్పష్టం చేశారు.
తన మనస్సాక్షికి తప్పుగా అనిపించే పనులను ఆయన ఎప్పటికీ అంగీకరించరని తెలిపారు. నటుడిగా సంపాదించిన గుర్తింపు, స్టార్డమ్ కంటే తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. భర్త ఎదుర్కొంటున్న వృత్తిపరమైన ఒడిదుడుకుల గురించి మొదట్లో ఆందోళన కలిగినప్పటికీ, ఆయన నమ్మిన విలువలు, తీసుకునే నిర్ణయాలకు తాను ఎప్పుడూ మద్దతుగా నిలుస్తానని పోనీ వర్మ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ సినిమాల్లో తక్కువగా కనిపించడం వెనుక ఉన్న కారణాలపై మరోసారి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

