Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీటక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను సోమవారం అధికారులు లెక్కించారు. దాదాపు 17 రోజుల్లోనే ఆలయానికి రూ.2.18కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 16 వరకు హుండీల ద్వారా రూ,2,18,94,668 నగదు వచ్చిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. 152.400 గ్రాముల బంగారం, రెండు కిలోలకుపైగా వెండి.. యూఎస్ డాలర్లు 423, మలేషియా రింగిట్స్ 108, యూకే ఫౌండ్స్ 20, సింగపూర్ డాలర్స్ పది, జింబాబే క్వచ్చాస్ 120, కెనడా డాలర్స్ 50, సౌదీ అరేబియా రియాల్స్ 20, థాయిలాండ్ బాట్స్ 20.. తదితర విదేశీ కరెన్సీ సైతం హుండీల్లో వచ్చాయని వివరించారు. పటిష్ట బందోబస్తు మధ్య, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు శివసేకులు పాల్గొన్నారు.