అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద నీరు వస్తుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి ప్రాజెక్టుకు 1,19,980 క్యూసెక్కుల నీరు వస్తుండగా 53,580 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.20 అడుగులుగా ఉంది.
ప్రాజెక్టు కెసాసిటీ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ద్వారా సాగర్‌కు 62,296 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.