Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా సందర్భంగా ఈ నెల 15 నుండి దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అవుతాయని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఈవో పెద్దిరాజు ఆహ్వానించారు. ఈ మేరకు కొట్టు సత్యనారాయణకు ఆహ్వాన పత్రం అందజేశారు.
రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దసరా నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం వారికి వేదపండితులచే వేదాశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదం, ఙ్ఞాపిక అందించారు.