Srisailam | శ్రీశైలం : పాఠశాలలు గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదని పోలీసులు హెచ్చరించారు. నద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు డీఎస్పీ రామాంజనేయ నాయక్ సూచనల మేరకు సీఐ జీ ప్రసాదరావు ఆధ్వర్యంలో రాజేంద్ర కుమార్, రఘునాథుడు, బాలకృష్ణ, నాను నాయక్‌తో కలిసి శ్రీశైలంలోని హైస్కూల్‌తో పాటు మిగతా పాఠశాలల నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న దుకాణాలపై దాడులు చేసి, సరుకును సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పాఠశాలకు కనీసం వంద మీటర్ల దూరం వరకు వీటిని వక్రయించకూడదని, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు పలు షాపుల్లో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే, విద్యార్థులకు జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అమ్మవద్దని దుకాణ యజమానులకు సూచనలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.