Srisailam Temple | భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీశైలం దేవస్థానం కీలక సూచనలు చేసింది. ఆర్జితసేవలు, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది. వసతి గదులతో పాటు అన్ని ఆర్జిత సేవా టికెట్లు, శ్రీస్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లు టికెట్లను వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చని పేర్కొంది. భక్తులంతా తప్పనిసరిగా దేవిస్థానం అధికారిక వెబ్సైట్ srisalladevasthanam.orgతో పాటు aptemples.ap.gov.in వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు. దేవస్థానం, దేవదాయశాఖ వెబ్సైట్స్ కాకుండా ఇతర నకిలీ వెబ్సైట్స్ని నమ్మి మోసపోవద్దని సూచించింది. పూర్తి వివరాలకు 83339 01351 / 52 / 53 నంబర్లలో సంప్రదించాలని ఆలయ అధికారులు కోరారు.