Srisailam | శ్రీశైలంలో 30 పడకల దవాఖాన నిర్మాణం.. ధర్మకర్తల మండలి నిర్ణయం..!
Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది.
Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం గో సంరక్షణ శాల (గౌరీ గణేశ గోశాల)లో రూ.36 లక్షల అంచనా వ్యయంతో రక్షణ కంచె ఏర్పాటు, అవసరమైన చోట్ల గాల్వనైజ్డ్ షీట్‌తో షెడ్ ఏర్పాటు, సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం, విభూది తయారీ షెడ్డుకు మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య స్వామి, జంగం సుజాతమ్మ, జీ నరసింహారెడ్డి, ఎం విజయలక్ష్మి, అలకుంట గారి మురళి, మేరాజోత్ హనుమంత్ నాయక్, ఓ మధుసూధన్ రెడ్డి, సూరిశెట్టి మాధవీ లత, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, రామ్మోహన్ నాయుడు, దేవస్థానం సహాయ ఈఓ రమణమ్మ, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అకస్మికంగా మరణించిన దేవస్థానం వేద పండితులు జగన్నాథ శర్మ మృతి చెందడం ఎంతో బాధాకరం అని ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి అన్నారు. ఆయన ఆత్మ శాంతి చెందాలని కోరుతూ సమావేశం మౌనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ విజయవంతంగా మహా కుంభాభిషేకం నిర్వహించిన ఈఓ పెద్దిరాజు, దేవస్థానం సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు.
దేవస్థానం ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలివి..
- కర్నూల్ నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద రూ.4.99 కోట్ల అంచనా వ్యయంతో కల్యాణ మండపం నిర్మాణం.
- కర్నూల్ నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద రూ.3.70 కోట్ల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయం నిర్మాణం.
- రూ.15 కోట్ల అంచనా వ్యయంతో సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాలకు నీటి సరఫరా ఏర్పాట్లు.
రూ.9.5 లక్షల అంచనా వ్యయంతో మల్లికార్జున సదన్ అతిథి గృహానికి మరమ్మతు పనులు, అభివృద్ధి పనులు. - భక్తుల సౌకర్యార్థం రూ.10.60 లక్షలతో కుమార సదన్ వసతి సముదాయంలో అభివృద్ధి పనులు.
- రూ.39.90 లక్షల అంచనా వ్యయంతో వచ్చే వేసవి, శ్రావణ మాసం, గణపతి నవరాత్రులు, దసరా మహోత్సవాలు, కార్తీక మాసం తదితర సందర్భాల్లో పైప్ పెండాల్స్, షామియానాలు, గ్రీన్ మ్యాట్ తదితరాల ఏర్పాటు.

- రూ.15.5 లక్షల అంచనా వ్యయంతో భద్రతా చర్యల్లో భాగంగా పాత పుష్కరిణి వద్ద రక్షణ కటంజనాలు, పుష్కరిణి పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులు.
- రూ.16.75 లక్షల అంచనా వ్యయంతో భద్రతాచర్యల్లో భాగంగా హాటకేశ్వరాలయం వద్ద రక్షణ కటంజనాల ఏర్పాటు.
- రూ.17 లక్షల అంచనా వ్యయంతో ఫిల్టర్ బెడ్ వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రజా శౌచాలయాలు (పబ్లిక్ టాయిలెట్లు) ఏర్పాటు.
- రూ.15 లక్షల అంచనా వ్యయంతో పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా క్షేత్ర పరిధిలో పలుచోట్ల చెత్త కుండీల ఏర్పాటు.

- రూ.6.5 లక్షల అంచనా వ్యయంతో సిద్ధ రామేశ్వర పాదాల పరిసర ప్రాంతాల్లో జల్లు స్నానానికి ప్లాట్ ఫామ్ నిర్మాణం తదితర పనులు.
- టీటీడీ ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థానానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేవదాయశాఖకు ప్రతిపాదన.
- క్షేత్రంలో జరుగుతున్న అభివ్రుద్ధి పనుల నేపథ్యంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్ట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతిపాదన.
- దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

