శ్రీశైలం: ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 97,503 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 92,175 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 884.10 అడుగుల వద్ద నీరు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. 212.4385 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.