శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ది పనుల నిర్మాణాలలో రాజీపడకుండా త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని గుత్తేదారులకు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం శ్రీ లలితాంబిక వాణిజ్య సముదాయంలోని నూతనంగా నిర్మిస్తున్న 36 దుకాణాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. చైర్మన్ వెంట ఈఈ రామకృష్ణ, డీఈ నర్సింహారెడ్డి, సీఎస్వో నర్సింహారెడ్డి, ఏఈలు చంద్రశేఖర శాస్త్రి, సీతారమేష్లు ఉన్నారు.