తిరుమల: తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీమలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా గోవిందనామ స్మరణతో ఆయల పురవీధులు మారుమ్రోగాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరగనుంది.