Sri Reddy | శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైఎస్ జగన్ ఫాలోవర్ అయిన శ్రీరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడింది. లోకేశ్‌తో పాటు ఇతర నేతలపై ఆమె తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విమర్శలు చేసిన నేతలకు కూటమి సర్కారు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పలువురు నేతలు అరెస్టయ్యారు. తాజాగా శ్రీరెడ్డిని సైతం అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌తో పాటు మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
అరెస్టుల నేపథ్యంలో శ్రీరెడ్డి ఇటీవల తనను క్షమించాలంటూ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా లేఖను విడుదల చేసింది. లేఖలో మొదట వైఎస్ జగన్, వైఎస్ భారతిని దగ్గరి నుంచి చూసే అదృష్టం తనకు దక్కలేదని వాపోయింది. టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని చెప్పింది. పార్టీ సభ్యురాలిని కాకపోయినా.. తన వాణిని బలంగా వినిపించానన్న శ్రీరెడ్డి.. తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని.. పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని చెప్పింది. తప్పును తెలుసుకొని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొంది. మంత్రి నారా లోకేశ్‌నూ అన్నా అని సంభోధిస్తూ.. తాను ఇకపై ఎవరినీ ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యలు చేయబోననని చెప్పింది.
తనకు ఇష్టమైన దేవుడిపై.. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని కోరింది. గతవారం రోజులుగా తిండీ, నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని వాపోయింది. తనతోపాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలేయాలని వేడుకుంది. అలాగే, చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ, జనసేనకు అండగా ఉన్న మీడియా సంస్థలకు సైతం క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. ఈ లేఖ తాను తప్పించుకోవడానికి కాదని.. వారం రోజులుగా కామెంట్స్ మనోవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తన బుద్ధి మాత్రం మారదంటూ లేఖలో శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
Forgive me Jagananna.. pic.twitter.com/RCPHg0u1Bz
— Sri Reddy (@SriReddyTalks) November 14, 2024