తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమల (Tirumala ) వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొనసాగుతున్న సంస్థలకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కోటీ రూపాయలను విరాళంగా అందజేశారు. ఎనర్ టెక్ కామ్ ( Ennar Tech Com) నెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏవీ రమణరాజు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి కోటీ వెయ్యి పదహారు రూపాయల డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడు( BR Naidu) , అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలు అభినందించారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల వల్ల హుండీకి రూ. 3.98 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.