అమరావతి : సంక్రాంతి పండుగ (Sankranti festival) సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు (Special trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రైలు నంబరు 07615 ప్రత్యేక రైలు ఈ నెల 11,15 తేదీల్లో కాచీగూడ లో సాయంత్రం 5.45 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు(Srikakulam Road) చేరుకుంటుందని వివరించారు.
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నంబరు 07616 ఈ నెల 12,16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్లో మధ్యాహ్నం 2.45 కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7.35 కి కాచీగూడ (Kachiguda) చేరుతుందని వెల్లడించారు. ఈ రైలు మల్కజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు(Guntur) , విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి (Anakapalli) , దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందురు స్టేషన్లలలో ఆగుతుందని పేర్కొన్నారు.
రైలు నంబరు 07617 ప్రత్యేక రైలు ఈనెల 8న రాత్రి 7.20కు చర్లపల్లిలో (Charlapalli) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నంబరు 07618 ఈ నెల 9న మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి చర్లపల్లి చేరుతుందన్నారు.