తిరుమల : తిరుమల (Tirumala) లో ఈనెల 16న రథ సప్తమి సందర్భంగా పలు ప్రత్యేక దర్శనాలను ( Special Darsan) రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈనెల 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని వివరించారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతి (Tirupati) లోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండదని అన్నారు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చని సూచించారు.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైంస్లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈనె 14 నుంచి 16వ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సీఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయని, ఈ రోజుల్లో ఎంబీసీ, టీబీ కౌంటర్లను మూసివేస్తామన్నారు. కౌంటర్లలో 4 లక్షలతో పాటు అదనంగా మరో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.