అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల (Rentachintala) విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు. ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రెంటచింతలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సంమయంలో టాటా ఏస్‌లో 38 మంది ఉన్నారని చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.