తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా స్వామివారు రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమించారు. వాహన ఊరేగింపు సందర్భంగా భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనదని, గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనంగా సేవలందించారని అర్చకులు తెలిపారు.
కాగా నిన్న తిరుమలలోని శ్రీవారిని 71,034 మంది భక్తులు దర్శించుకోగా 32, 291 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల రూపేణా టీటీడీకి రూ. 3.38 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.