Mangli | మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందని సింగర్ మంగ్లీ అన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మంగ్లీ.. తన పాటలతో అందర్నీ ఉత్సాహపరిచారు. ఈ వేడుక అనంతరం కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో కలిసి మంగ్లీ మీడియాతో మాట్లాడారు.
రామ్మోహన్ నాయుడు అన్న చెప్పినట్లు శ్రీకాకుళం జిల్లా నిజంగానే పుణ్యభూమి వంటిదని మంగ్లీ కొనియాడారు. సూర్యభగవానుడి రథ సప్తమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తనపై శ్రీకాకుళం జిల్లా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. వచ్చే జన్మలో ఇక్కడే పుట్టాలని అనిపించిందని పేర్కొన్నారు. వాళ్ల ప్రేమాభిమానాలు చూసి ఎంతో ఎమోషన్ అయ్యాయనని చెప్పారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడిపై అన్నమయ్య రాసిన కీర్తనను మంగ్లీ ఆలపించారు.
మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలి: సింగర్ మంగ్లీ
తొలిసారి అరసవల్లి సూర్య దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ స్వామి వారిపై అన్నమయ్య కీర్తన ఆలపించిన సింగర్ మంగ్లీ.#Mangli #RadhaSaptami #Srikakulam pic.twitter.com/MEVNFIWF3D
— Telugu Insider (@telugu_insider) February 4, 2025