AP Pensioners | ఏపీలో పింఛన్‌దారులకు షాక్.. వారి నుంచి రికవరికి ఆదేశాలు
AP Pensioners | ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు ( Pensioners ) షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ ( Recovery ) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్న సదస్సులో రెండో రోజు కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఇందులో భాగంగా సామాజిక పింఛన్లలలో సుమారు 6 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా అనర్హులున్నారని స్వయాన సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్ ( Minister Manohar ) వెల్లడించడంతో ప్రభుత్వం షాక్‌కు గురయింది. రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మంది అన్ని రకాల పింఛన్‌దారులుండగా దివ్యాంగుల కోటాలో అత్యధికంగా అనర్హులున్నారంటూ సదస్సులో వివరించారు.
అయితే వైసీపీ హయాంలో సదరం క్యాంపులు నిర్వహించి మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్లు జారీ చేశారని గుర్తించిన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు 10,958 పింఛన్లలో సుమారు 563 మంది అనర్హులున్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో అనర్హులపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
రానున్న మూడు నెలల్లో పింఛన్ తీసుకున్న అనర్హుల గుర్తించి వారి నుంచి రికవరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

