అమరావతి : ఆంధ్రప్రదేశ్లో బీజేపీ (AP BJP ) కి షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి (MLA Parthasarathy) ఒంటెద్దు పోకడాలు, విధానాలు నచ్చక మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ (Prakash Jain) రాజీనామా చేశారు.
నియోజకవర్గంలో బీజేపీ నాయకుల అవినీతిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ జైన్ వెల్లడించారు. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో అధోని టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో బీజేపీలో చేరారరు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.