Srisailam Shashti Special Puja | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో షష్టి సందర్బంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) లవన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి స్వామివారికి, కుమారస్వామికి అభిషేకాలు, పుష్పార్చన చేశారు.
సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పరివార దేవతలు జ్వాలా వీరభద్రస్వామి వారికి శాస్త్రోక్తంగా షోడశోపచార క్రతువులు నిర్వహించారు. మల్లికాగుండంలోని శుద్ద జలాలతో స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు పూజాది క్రతువులు చేసినట్లు అర్చకులు తెలిపారు.
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సికింద్రాబాద్ వాసి అజయ్ కుమార్ రూ. లక్ష విరాళం అందజేశారు. వీఎస్ ప్రకాశ్ రావు ఙ్ఞాపకార్థం అజయ్ కుమార్ ఈ విరాళం అందజేశారు.
బుధవారం ఆలయ ఏఈవో మల్లయ్యకు విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.