AP News | తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో అదుపుతప్పి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ వ్యాన్ మంగళవారం బయల్దేరింది. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యాన్ బోల్తాపడింది.
మినీ వ్యాన్ బోల్తా పడటంతో జీడిపిక్కల కింద ఇరుక్కుని ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనలో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు.
మినీలారీ బోల్తాపడి ఏడుగురి దుర్మరణం
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురి దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో నిడదవోలుకు బయలుదేరిన మినీ లారీ.
ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం… pic.twitter.com/5fGgWmgu2C— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2024