అమరావతి : ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్(IAS), ఐపీఎస్‌లకు (IPS) పదోన్నతులు (Promotions) కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికేయ మిశ్రా(Kartikeya Misra) , వీరపాండ్యన్, శ్రీధర్‌కు (Sridhar) కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంవో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు సీఎం కార్యదర్శిగా (CM Secretary) పదోన్నతిని కల్పించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా వీర పాండ్యన్‌ను , వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్‌లు విశ్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌కు పదోన్నతులు కల్పించింది.