అమరావతి : గ్రామ పంచాయతీల నుంచి నిధుల మళ్లింపును నిరసిస్తూ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో సర్పంచులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వం పంచాయతీ నిధులు
ప్రభుత్వం దొంగిలించిందంటూ ఆందోళన నిర్వహించారు. కేంద్రం కేటాయించిన నిధులు గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల హక్కులను రక్షించాలంటూ సర్పంచులు విజయవాడలో భిక్షాటన చేశారు.
గ్రామాల్లో పనులు చేపట్టేందుకు నిధులు లేవని, సహాయం చేసి ఆదుకోవాలని కోరుతూ కోరారు. ఏపీ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలను జీరో చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళ తీసిందని గ్రామాల్లోని 12,900 మంది సర్పంచుల వద్ద చిల్లి గవ్వ కూడా లేదని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు చేపట్టలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసమే భిక్షాటన చేస్తున్నామని వివరించారు.