అమరావతి : సంక్రాంతి (Sankranti ) పండుగ వచ్చిందంటే తెలుగు వాకిళ్లు రంగవల్లుల అలంకారాలతో ఎంతగా ఆకట్టుకుంటాయో అంతేస్థాయిలో ఏపీలో కోళ్ల పందేలు (Cock Fighting) ఆకట్టుకుంటాయి. కోట్లాది రూపాయలు చేతులు మారే పందాలు ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ జిల్లాల్లో ఈ ఏడాది భారీగా జరిగాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, ప్రజలు పందేలు ఆటలో జోరుగా పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!
తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లు
పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు pic.twitter.com/BmJGBWYbCC
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025
కోళ్ల పందేలతో పాటు, గుండాట, పేకాట, లాటరీ, జూదం తదితర పోటీలు విచ్చలవిడిగా జరిగాయి. ఈ పోటీలకు తామేమి తీసిపోమంటూ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు (Pig races ) నిర్వహించారు. ఈ పోటీలకు ఆయా జిల్లాల నుంచి పందెంరాయుళ్లు తమ పందులతో గ్రామానికి చేరుకున్నారు.
ప్రతి సంక్రాంతి పండుగకు ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారమని సంఘం నిర్వాహకులు తెలిపారు. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు. కోళ్ల మాదిరిగా జంతువులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా పోటీలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.