తిరుపతి : తిరుపతి( Tirupati ) శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 25న రథసప్తమి ( Rathasaptami ) ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
25న తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి తీసుకొచ్చి చక్రస్నానం, అనంతరం ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామి ( Govindarajaswamy) వాహన సేవలు ప్రారంభమవుతాయని వివరించారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారని వెల్లడించారు.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3.30 నుంచి 5.00 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనబాగ్యం కల్పిస్తామరని అన్నారు. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు గరుడ వాహనం ( Garuda Vahanam ) పై శ్రీవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు.