అమరావతి : ఏపీలో పీఆర్సీ కొత్త జీవోలకు వ్యతిరేకంగా తలపెట్టనున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమ్మెకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెలో ఆర్టీసీ క్రియశీల పాత్ర పోషించనుందని పీఆర్సీ సాధన సమితి నాయకులు వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సాధన సమితికి చెందిన నాయకులు పాల్గొన్నారు.
దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం ఉద్యోగుల సమ్మెకు ఎన్ఎంయూ, ఈయూ సంఘాలతో పాటు మరికొ న్నిసంఘాలు మద్దతు ప్రకటించాయి. రెండు పీఆర్సీల వల్ల ఆర్టీసీ కార్మికులు , ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనంచేయడం వల్ల ఆర్టీసీ సంస్థలో పనిచేసే వారందరికీ పలు సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందని వాపోయారు.