అమరావతి : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలిసిన ఆర్టీసీ డ్రైవర్లు(RTC Drivers) ఒకరినొకరు తన్నుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 6న విజయవాడ(Vijayawada) జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపై బస్ నిలిపే విషయంలో జమ్మల మడుగు డిపో డ్రైవర్‌పై కల్యాణదుర్గం డిపో డ్రైవర్ దాడి చేశాడు. అసభ్యపదజాలంతో బస్ ఎక్కి ప్రయాణికుల ముందే కాలుతో తన్నాడు. దీంతో ఆయన కూడా దాడికి పాల్పడడం ఒకరినొకరు బాహబాహికి దిగారు. ప్రయాణికులు కొందరు ఇద్దరికి సర్దిచెప్పారు.
అనంతరం ఆర్టీసీ అధికారుల దృష్టికి రావడంతో ఇద్దరు డ్రైవర్లను విచారించి వారిపై చర్యలకు సిఫారసు చేశారు. ప్లాట్‌ఫాంపై బస్సుల నిలుపుదలపై డ్రైవర్లు ఘర్షణలకు దిగటం పరిపాటంగా మారింది. బస్సు నడిచే సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ప్రయాణికులను భద్రత కరవు అవుతుందని ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.