అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) దంపతులు మృతి చెందారు. జిల్లాలోని సంగం మండలం వెంగారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు (RTC Bus) ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ భార్యను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆమె మృతి చెందిందని పోలీసులు వివరించారు. ఆటోలో ఉన్న మరికొందరికీ స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.