అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓ అవినీతి రెవెన్యూ అధికారి ఏసీబీ (ACB Raids) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం తహసీల్దార్(Tahisildar) మహ్మద్‌రఫీ ఓ రైతువద్ద రూ. 65 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
భూమి మ్యుటేషన్ (Mutations) కోసం బాధితుడు నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం తన కార్యాలయంలో లంచం తీసుకుంటుడగా అక్కడే మాటు వేసి అవినీతి నిరోదక శాఖ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. అతడిని వైద్య పరీక్షల కోసం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నారు.
AP News | బడికి వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక.. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో డెడ్‌బాడీ!
Kidney Scam | గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో పురోగతి.. ఇద్దరి అరెస్టు