రూ. 9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం : ఏపీ గవర్నర్
ap governor | ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. ఏపీ బడ్జెట్ ప్రారంభ
అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. ఏపీ బడ్జెట్ ప్రారంభ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. 2021-22లో రూ. 9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ. 1,416 కోట్ల సాయం, వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఆటో, ట్యాక్సీ, డ్రైవర్లకు రూ. 770 కోట్లు . జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించిందని తెలిపారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ. 2,304 కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు.
అమ్మఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13,023 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ‘వైఎస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ. 9,100 కోట్లు అందించిందన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ. 981. 88 కోట్లు అందించిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

