విజయవాడ, మే 11: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ సొమ్ము భారీగా బయటపడుతున్నది. శుక్రవారం ఒక వాణిజ్య వాహనంలో రూ.7 కోట్లను తరలిస్తుండగా తూర్పుగోదావరి పోలీసులు పట్టుకున్నారు.
భారీగా సొమ్మును తరలిస్తున్న ఈ వాహనాన్ని నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఒక లారీ ఢీకొనడంతో బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఏడు అట్టపెట్టెల్లోని నగదును వేరే ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని అందులోని నగదును లెక్కించగా, సుమారు ఏడు కోట్ల రూపాయలున్నట్టు తేలింది.