అమరావతి : భక్తుల కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు (Navaratri Celebrations) తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దుర్గమాత మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహాకులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో ( Currency notes) అలంకరించారు.
సుమారు రూ.4,41,99,999 విలువైన కరెన్సీనోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ అలంకరణను తిలకించేందుకు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామాత మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది .