అమరావతి : పిల్లలు భారం కాదని అది సంపదగా నిరూపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ( CM Chandrababu ) అన్నారు. రాష్ట్రంలో ఇకపై మూడో బిడ్డకు జన్మనిచ్చిన కుటుంబానికి వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లా నరసన్నపేట పట్టణంలో శనివారం స్వచ్ఛాంద్ర-స్వర్ణాంద్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సంపద సృష్టించి పేదవాళ్లకు పంచాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ చేసిన అరాచకంతో రాష్ట్రం అతలంకుతలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.