అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పోలీసులు సుమారు రూ. 2 కోట్ల విలువైన అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. 593 కేసుల్లో పట్టుబడిన 66 వేల అక్రమ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని జిల్లాలోని పంచలింగాల గ్రామం .తాండ్రపాడుకు వెళ్లే మార్గంలో రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లాలో పట్టుబడ్డ నాన్ డ్యూటీ పేయిడ్ లిక్కర్‌ను ధ్వంసం చేశామన్నారు.
కర్నాటక బోర్టర్, లోకల్ పోలీసులతో వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైన అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.