తిరుమల: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)కు చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి పూణెకు చెందిన సాగర్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ శుక్రవారం రూ.1, 00,11,000 విరాళంగా అందించింది. కంపెనీ ప్రతినిధి రూ.కోటి పదకొండు వేల రూపాయల చెక్కును తిరుమలలోని డోనర్ సెల్ కార్యాలయంలో డోనర్ సెల్ డిప్యూటీ ఈఓ పద్మావతికి అందజేశారు.