Pinnelli Ramakrishna Reddy | పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై రౌడీషీట్ తెరిచినట్లు తెలిసింది.
ఎన్నికల రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటులో ఈవీఎంల ధ్వంసంతో పాటు, టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడి చేశారని పిన్నెల్లి బ్రదర్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల మరుసటి రోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకుని రోడ్లపై జనాలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్‌పై ఇప్పటికే నాలుగు కేసులు తెరిచారు. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాజాగా మాచర్ల పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు సమాచారం.