అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో ( Prakasam district ) జరిగిన రెండు వేర్వేరూ రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని కొరిశపాడు మండలం పిచ్చికలగుడిపాడు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో తోట వెంకయ్య( 55), వెంకయ్య తల్లి మహాలక్ష్మమ్మ(75) మృతి చెందింది.
ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు బస్సు కిందపడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి కోమటిగుంట చెన్న కేశవులు(65) దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.