అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్కు చెందిన అయ్యప్ప భక్తుల బృందం మినీ బస్సులో శబరిమలైకి వెళ్తుండగా నంద్యాల జిల్లా దీబగుంట వద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తుల్లో పది మందికి గాయాలు కావడంతో వారిని హుటాహుటినా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.