కావాల్సినంత క్యాల్షియం
క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుందని చాలామంది పిల్లలకి ఉదయాన్నే పాలు తాగిస్తుంటారు. పిల్లలేకాదు పెద్దవారు కూడా క్యాల్షియం కోసం పాలు తాగుతుంటారు. వయసు పెరిగేకొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది కాబట్టి వృద్ధులను కూడా పాలు తాగమని చెబుతుంటారు.
క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుందని చాలామంది పిల్లలకి ఉదయాన్నే పాలు తాగిస్తుంటారు. పిల్లలేకాదు పెద్దవారు కూడా క్యాల్షియం కోసం పాలు తాగుతుంటారు. వయసు పెరిగేకొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది కాబట్టి వృద్ధులను కూడా పాలు తాగమని చెబుతుంటారు. క్యాల్షియం సప్లిమెంట్స్ కూడా వాడుతుంటారు. పాలతోపాటు ఈ ఆహార పదార్థాలకు మీ డైట్లో చోటివ్వండి. కావాల్సినంత క్యాల్షియం లభిస్తుంది.
పాలు తాగకపోతే క్యాల్షియం అందదని చాలామంది అభిప్రాయం. కానీ, అది వాస్తవం కాదు. 100 మి.లీ. ఆవుపాల ద్వారా 120 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. అదే 100 మి.లీ. గేదెపాలు తీసుకుంటే.. 210 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. ఇంతకు రెట్టింపు క్యాల్షియం అందించే పదార్థాలు ఉన్నాయి. అవేంటంటే..
బెస్ట్ సోర్స్: ఉలవల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రా. ఉలవల ద్వారా దాదాపు 290 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. నాన్ వెజ్, పాలు తీసుకోలేని వారికి ఉలవలతో క్యాల్షియం అవసరాలు తీరిపోతాయి.
ఎముకలు ఉక్కులా: రాగులు కూడా క్యాల్షియం రిచ్ సోర్స్. దాదాపు 100 గ్రా. రాగుల ద్వారా 350 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. రాగి జావ, రాగి ఇడ్లీ, దోశ, రొట్టె ఇలా రకరకాల రూపాల్లో రాగులు టేస్ట్ చేయొచ్చు. వీటి వల్ల ఎముకలు ఉకులా మారతాయి.
అంతకుమించి: 100 గ్రా. తోటకూరలో దాదాపు 400 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. ఆకుకూరల్లో క్యాల్షియం సమృద్ధిగా అందించేవాటిలో తోటకూర ముందువరుసలోఉంటుంది.
రుచికి రుచి: 100 గ్రా. మునగాకులో 440 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. మునగాకు పప్పు, తాలింపు, పొడి ఇలా రకాలుగా తినొచ్చు.
సూపర్‌ఫుడ్: అవిసె ఆకులు కూడా క్యాల్షియాన్ని అందించే సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. దాదాపు 100 గ్రా. అవిసె ఆకుల్లో 1200 మి.గ్రా. కాల్షియం ఉంటుంది.
ఎలాగైనా తినొచ్చు: 100 గ్రా. నల్లనువ్వుల్లో 1450 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

