అమరావతి : విశాఖ పట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో దంపతులు(Couple) మృతి చెందారు. శుక్రవారం విశాఖ వ్యాలీ వద్ద జాతీయ రహదారిపై స్పీడ్‌గా వచ్చిన లారీ వెనుక నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సారవకోట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.