(Accident) విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు. గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది. విశాఖపట్టణం పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతులను ధనరాజ్ (22), కే వినోద్ ఖన్నా (22) గా గుర్తించారు. చేతికొచ్చిన ఇద్దరు యువకులు మరణించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఇద్దరు స్నేహితులు మరణించడంతో మారికవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మంగళవారం రాత్రి మారికవలస ప్రాంతానికి చెందిన ధనరాజ్, వినోద్ ఇద్దరూ కలిసి.. పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లారు. కొమ్మాది వద్ద బంక్ వద్ద బైక్‌లో పెట్రోల్ పోయించుకుని తిరిగి పనోరమ హిల్స్‌కు బయల్దేరారు. స్టేడియం సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం ఒకటి వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దాంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో, వినోద్ ఖన్నా రామాటాకీస్ సమీపంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..