అమరావతి : ఎన్నో ఆశలతో సొంత ఊరును వదిలి ఉద్యోగం కోసం దూరప్రాంతానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా (Praksam District) చీమకురిత మండలం బోధవారి చిరంజీవి (32) అనే యువకుడికి లండన్‌లో (London) ఉద్యోగం వచ్చింది.
సాప్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి నిన్న రాత్రి కారులో బయలుదేరారు. ప్రమాదవాశాత్తు కారు డివైడర్‌ను ఢీకొని చిరంజీవి మృతి చెందాడు.కారులో ఉన్న మరో నలుగురికి గాయాలు కావడంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.