అమరావతి : వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా బటన్‌నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు ( Chandra Babu) అధికారంలో ఉండి ఆ పని ఎందుకు చేయలేక పోతున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ప్రశ్నించారు. శనివారం చిత్తూరులో మీడియాతో ఆమె మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుందని, తల్లికి వందనం కోసం 80 లక్షల మంది పిల్లలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT) బటన్ నొక్కడం ఏమైనా గొప్పా అని గతంలో విమర్శించినా చంద్రబాబు, నేడు మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కుతుండగా మీరెందుకు నొక్కలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు .
రాష్ట్ర ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలపై (Supersix Promises) ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేస్తే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ఏడాదిగా ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి మీరు ఇస్తారా? లేక మీ చంద్రబాబు ఇస్తారా? సమాధానం చెప్పాలని ప్రభుత్వం అప్పుల్లో ఉన్నాగాని సూపర్ సిక్స్‌లను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడగాలని మంత్రి నారా లోకేష్‌కు ఏ కాలర్ పట్టుకుని అడగాలని నిలదీశారు.