Visakhapatnam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీ కొట్టి నగరంలోని ఓ ఫ్లైఓవర్ (flyover) పై నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
విశాఖ – ఎన్ఏడీ ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. అనంతరం అదేవేగంతో గాల్లో ఎగిరి ఫ్లైఓవర్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
విశాఖ – ఎన్ఏడి ఫ్లైఓవర్ పై డ్యూక్ బైక్ పై అతివేగంతొ డివైడర్‌ను ఢీకొని ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ ముగ్గురు యువకులు.
ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు. pic.twitter.com/KlTulxtr5Y
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2024
Also Read..
Mallikarjun Kharge | మల్లికార్జున ఖర్గే హెలికాఫ్టర్ తనిఖీ.. తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్
School Bus | విషాదాంతమైన గ్రాడ్యుయేషన్ ట్రిప్.. స్కూల్ బస్సు ప్రమాదంలో 11 మంది మృతి
Pig Kidney | శస్త్రచికిత్స జరిగిన రెండు నెలలకు.. పంది కిడ్నీ మార్పిడి రోగి మృతి