అమరావతి : ఏపీ మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయ (Srisailam reservoir ) పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు ( Fishing ) వెళ్లొద్దని హెచ్చరించారు. చేపల వేట నిషేధకాలం అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. జులై, ఆగస్టు నెలలు చేపల సహజ సంతానోత్పత్తి సమయమని వివరించారు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్స్(Back Water) లో చేపలవేట వద్దని ఆదేశించారు.
నిన్న శ్రీశైలం డౌన్‌స్ట్రీమ్ వద్ద పెద్ద సంఖ్యలో మత్స్యకారులు వేటకు రాగా అధికారులు అప్రమత్తమై ఉత్తర్వులు జారీ చేశారు. జూరాల, సుంకేశుల నుంచి భారీగా వరద నీరు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో కొన్ని రోజుల పాటు పదిగేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. ఎగువ భాగాన నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు సోమవారం శ్రీశైలం గేట్లను మూసివేశారు. గేట్లు మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు పెద్ద సంఖ్యలో చిన్న చిన్న పడవలలో వచ్చి చేపల వేటను కొనసాగించారు.