అమరావతి : మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Rama Krishna Reddy) ఊరట లభించింది. సజ్జలను అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఏపీ హైకోర్టు (AP High Court) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది . ఈ సందర్భంగా దర్యాప్తునకు సహకరించాలని ఆయనకు ఆదేశించింది. కాగా సజ్జల ప్రధాన బెయిల్పై ఈనెల 25కు విచారణను వాయిదా వేసింది.
టీడీపీ కార్యాలయం(TDP Office) పై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను 120వ నిందితుడిగా చేర్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ నోటీసు నిబంధల ప్రకారం నేను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే, హత్యాయత్నం సెక్షన్ను చేర్చారని, తాను అమాయకుడిని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.