అమరావతి : ఏపీలో అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రాలు (White papers) విడుదల చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ( Perninani) విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్వేతపత్రంలో అన్ని అసత్యపు ఆరోపణలే ఉంటున్నాయని , ఇప్పటి వరకు ఏ ఒక్కటి నిరూపితం చేయాలేదని ఆరోపించారు.
అధికారం చేపట్టి 35 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీల్లో పెన్షన్లు(Pensions) తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తిట్టడమే పని పెట్టుకున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram) ను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పడం లేదని ఆరోపించారు. అమరావతి సంగతి కూడా అంతేనని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు అనుభవం పనికిరాకుండా ఉందని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం 2024-25 రాష్ట్ర బడ్జెట్ (Budget) ప్రవేశ పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. జగన్కు అనుభవం లేకున్నా సరైన సమయానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకరానికి 48 గంటల ముందు కేంద్రం నుంచి డబల్ డబ్యులేషన్ కింద రూ. 5,600 కోట్లు ఖజానకు వచ్చిందని వివరించారు.