అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు, మే 2 నుంచి 13 వరకు పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ పరీక్షలు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.