అమరావతి : ఏపీలో అధికార పార్టీకి చెందిన వైసీపీ రెబల్(YCP Rebels)ఎమ్మెల్యేలు, స్పీకర్(Speaker) మధ్య లేఖల యుద్ధం ప్రారంభమైంది. విచారణకు హాజరుకు గడువు కావాలని కోరాగా అందుకు స్పీకర్ ససేమిరా అంటూ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Sitaram) విన్నవించింది.
దీంతో రెబల్ ఎమ్మెల్యేలు ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు(Notices) పంపారు. అయితే తాము వివరణ ఇవ్వడానికి 30 రోజుల గడువు కోరుతూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ రాశారు. నోటీసుతో పాటు పంపిన వాటిపై నిర్ధరించుకోవాల్సి ఉందని, పేపర్, వీడియో క్లిప్పింగ్‌లపై పరిశీలించాల్సి ఉన్నందున రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజులు ఇవ్వాల్సి ఉంటుందని స్పీకర్ పంపిన లేఖలో పేర్కొన్నారు. 30 రోజుల సమయం కుదరదని స్పీకర్ స్పష్టం చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.
ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కావడం, ఈ మూడు సీట్లను గెలుచుకునేందుకు అధికార వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. రెండు స్థానాలు గెలుచుకునేందుకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ మూడో స్థానం టీడీపీ పరం కాకుండా టీడీపీకి సహకరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేపై వేటు వేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉండడంతో స్పీకర్ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష, రెబెల్ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు.